top of page
Image by Ambitious Studio* | Rick Barrett

ALL INDIA

ASPIRING WRITER's

AWARD

Kowshik Ramadugu

REGISTRATION ID

B5011

YOUR FINAL SCORE IS IN BETWEEN

9.15 - 9.75

IFHINDIA CONGRATULATE YOU FOR BEING IN THE TOP 10 FINALISTS.

1. THE TITLE WINNER SCORE MUST BE MORE THAN 9.70 WHO WILL BE  WINNING 1,50,000/- CASH PRIZE & YOU MAY BE ONE OF THEM FOR SURE BECAUSE OUR FINAL WINNER IS IN BETWEEN THOSE TOP 10 FINALISTS INCLUDING YOU. 
2. SINCE YOU ARE ONE OF THOSE TOP 10 FINALIST YOU WILL BE GETTING EXCLUSIVE GIFT COUPON WORTH 5000/- EACH
(Note : You must participate either in ONLINE EVENT or OFFLINE EVENT without fail to get your AWARD BENEFITS)
3. ALL TOP 10 FINALIST INCLUDING YOU MUST PARTICIPATE IN THE MEGA EVENT EITHER OFFLINE OR ONLINE BECAUSE EVEN YOU MAY BE THE ONE WHO WIN THE TITLE FOR SURE.
4. INCASE YOU ARE NOT WILLING TO PARTICIPATE IN THE MEGA EVENT/ AWARD CEREMONY EITHER OFFLINE OR ONLINE then your journey in the contest will end here. HOWEVER YOU WILL STILL RECEIVE THE BEST 25 WRITERS BENEFITS but you will not get any benefits for being in the TOP 10 incase you quit from the contest hereafter.

click on the below link to know more information about the FINAL ROUND



 

Written By

Kowshik Ramadugu

కస్తూరి గారి నిలయం

బ్రోకర్ కేసులో అరెస్టైన ఒక అమ్మాయిని అబ్బాయిని పోలీస్ స్టేషన్ కి తీసుకోని వచ్చారు ,అబ్బాయిని లాక్అప్ లొ పెడితే,అమ్మాయిని స్టేషన్లో ఉన్న బల్లా మీద కూర్చో పెట్టారు. ఇద్దరి మొఖంలో ఒకే బాధ, అంతే కాకుండా ఒక చిన్న టెన్షన్. బల్లా మీద కూర్చున్న అమ్మాయి తన చీర కొంగు తోటి మొఖం దాచుకుంది. కోర్టుకి తీసుకోని పోవాలి జీప్ రెడీ చేయమని ఎస్ఐ గారు అంటే, సరే సర్ అని కానిస్టేబుల్ జీప్ రెడీ చేసాడు . తమ జీవితంలో కోర్టు మెట్లు ఎక్కాల్సొస్తుంది అని వారు అనుకోలేదు. అయినా వాళ్ళ మొఖంలో భయం కనిపిస్తలేదు. కోర్టులో తదుపరి కేసు ఎవరిది అని జడ్జి గారు అడిగితే, వీరిదే అండి అని పిలిచారు. ఏంటి కేసు అంటే..... బ్రోకర్ కేసులో వీళ్లిద్దరు అరెస్ట్ అయ్యారు అండి అని ఒక లాయర్ వాదించాడు. చూడటానికి పాతిక సంవత్సరాల పిల్లలు లాగా ఉన్నారు ఎం పని అమ్మ మీరు చేసింది, మీ వల్లే సొసైటీ అంత నాశనమైపోతుంది, కొంచెం కూడా సిగ్గు లేదా మీకు అని జడ్జి గారు తిడుతున్నారు. స్కూల్లో టీచర్ ముందు చేతులు కట్టుకొని నిలుచునట్టు అబ్బాయ్ అమ్మాయి ఇద్దరు నిలుచున్నారే తప్ప ఒక్కరి నోటి నుండి కూడా ఒక్క మాట రావట్లేదు. ఏంటి ఎం మాట్లాడకుండా ఉంటె ఏంటి అర్ధం అని జడ్జి గారు అడిగిన, నిశ్శబ్దంగానే ఉన్నారు . మీ తరుపున వాదించటానికి లాయర్ ఎవరైనా ఉన్నారా అని అడిగితే, తల సైగతో లేరు అని చెప్పారు. ఇంతలో ఒక పెద్దాయన లేచి నేను ఉన్నాను, వీళ్ళ తరుపున నేను వాదిస్తాను అన్నారు. మీరా! సరే ప్రొసీడ్ అని జడ్జి గారు అంటే. వీళ్ళు వ్యభిచారం చేసారు అని అంటున్నారు, కాదు అని నేను అంటున్నాను. ఎలా చెప్పగల్గుతున్నారు అని జడ్జి గారు అంటే...ఎలా అంటే ...
వీళ్ళు భార్య భర్తలు కనుక…
కోర్టులో ఉన్న వాళ్ళు అందరు ఆ మాటకి ఆశ్చర్యపోయారు, సమాధానాలు లేని గొంతు వాళ్ళ సొంతమైంది. లేదు సార్... మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము రైడ్ చేసాం అక్కడ వీళ్లే ఉన్నారు, ఆ అమ్మాయి కూడా ఒప్పుకుంది ఈ ఇల్లు ఆమెదే అని అందుకే అరెస్ట్ చేసాం అని అరెస్ట్ చేసిన పోలీస్ ఆఫీసర్ అన్నారు. మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే కానీ ఆ ఇల్లు ఈ అమ్మాయిది కాదు…తనది అని ఒక వ్యక్తిని తీసుకోని వచ్చారు లాయర్. జడ్జి గారి వైపు చూసి ఆమె దండం పెట్టింది.అస్సలు ఏంటి అమ్మ ఈ గందరగోళం మొత్తం..ఎం జరిగిందో అస్సలు వివరంగ చెప్పు అని జడ్జి గారు అడిగారు..
చెప్తాను సారు...చెప్తాను...
నేను ఒక వేశ్యని అండి, నా పేరు కస్తూరి...ఒక రోజు ఎప్పటి లాగే ఒక రాత్రి పూట బస్టాండ్ దగ్గర నిలుచున్నా అక్కడ వీళ్ళద్దరు కింద పడుకొని కనిపించారు. నా చప్పుడికి లేచారు, నన్ను చూసి,నా వేషం చూసి వీళ్ళు భయపడ్డారు.మా బతుకులే అలాంటివి కదా సారు. చలిలో పడుకొని ఉన్నారు కదా ఏంటి అని అడిగితే నాకు చెప్పడానికి వాళ్ళు ఆలోచించారు, అబ్బాయ్ ఎదో చెప్పబోతే అమ్మాయి ఆపే ప్రయత్నం చేస్తుంది. ఆమె ఎవరో ఏంటో ఎందుకు చెప్తున్నావ్ అంటే, ఫరువాలేదులే అని అమ్మాయితో వాదించి ఈ అబ్బాయ్ చెప్పాడు...
మేము ఇద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నాం, నాలుగు సంవత్సరాల నుండి ప్రేమించుకున్నాం, నాకు ఎవరు లేరు, ఆ కారణం తోటె అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు మా పెళ్ళికి ఒప్పుకోలేదు. అందుకని బయటికి వచ్చేసాం. నిన్న గుడిలో పెళ్లి చేసుకున్నాం. ఇల్లు ఎక్కడైనా అద్దెకు దొరుకుద్ది ఏమో అని తిరుగుతున్నాం కానీ ఎవరు ఇవ్వట్లేదు, మాకు పెళ్లయింది అన్న నమ్మట్లేదు. ఎక్కడ పడుకోవాలో తేలిక ఇక్కడ బస్టాండ్లో పడుకున్నాం. సరే అయితే నాతో వస్తారా అని అడిగితే ఒకరి మొఖం ఒకరు చూసుకున్నారు, రాము అని చెప్పారు. నాకు ఒక ఇల్లు ఉంది ఆ ఇంట్లో మీరు అద్దెకి ఉందురు కానీ రండి అని చెప్పిన, రాము, మీలాంటి వాళ్ళ ఇంటికి మేము రాము అన్నారు. ఈ ప్రపంచం మా మీదా ఉన్న మరకని చూస్తది కానీ మనసుని చూడదు కదా సారు. వాళ్ళని చాల సేపు బ్రతిమలాడితే, వాళ్ళకి ఇంకో గతి లేదు అని భావించి వస్తా అన్నారు. మేము వస్తాము కానీ మాకు మీ ఇల్లు నచ్చక పోతే వెళ్ళిపోతాం అని చెప్పారు, సరే అని చెప్తే అప్పుడు నాతో బయలుదేరటానికి సిద్ధం అయ్యారు. ఆటోలో ముగ్గురం బయల్దేరాం, ఇంటికి చేరుకున్నాం. ఇల్లు చూడటానికి బాగుంది, ఇల్లు బాగుంది మీరు ఇందులో ఉంటారా అని అబ్బాయ్ అడిగితే,అవును బయట నుండి అందంగా ఉన్న ఇల్లు మాత్రమే అందరికి కనిపిస్తది లోపల ఉన్న బాధలు ఎవరికీ కనిపించవు కదా అని కస్తూరి అన్నది.
మీరు ఇక్కడ కింద పోర్షన్ లో ఉండండి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, నేను పైన ఉంటా అని చెప్పింది. ఆవిడా ఎం పనిచిస్తుందో పక్కనపెడితే వాళ్ళకి ఆ క్షణంలో ఆమె ఒక దేవత లాగా కనిపించింది. కొత్త జీవితం వాళ్ళు ఇద్దరు ఆ ఇంట్లో ఆరంభించారు. కస్తూరి గారు చెప్పినట్టే ఆమె వళ్ళ వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. చేతిలో ఉన్న డబ్బులతో ఎంత కాలం అని గడపగలరు. ఒక రోజు అమ్మాయి ఇంటి బయట దిగాలుగా కూర్చుంది. ఏంటి అమ్మాయి ఆలా దిగాలుగా కుర్చున్నావ్ అని కస్తూరి అడిగితే ….
ఎం లేదు అమ్మ ఇంట్లో నుండి వచ్చేసాం, చేతిలో ఉన్న డబ్బులు అయిపోవొచ్చాయ్, ఎన్ని చోట్ల తిరిగిన ఆయనికి ఎక్కడ ఉద్యోగం దొరకట్లేదు.
ఓహ్ అంతేనా ! నాకు తెల్సిన వాళ్ళని అడిగి చూస్తానులే నువ్వు ఎం రంది పడకు అని భరోసా ఇచ్చింది కస్తూరి.కస్తూరి మాటలని పెద్దగా ఆమె పట్టించుకోలేదు, ఆవిడ ఎలా ఉద్యోగం ఇప్పిస్తుంది అని.
రెండు రోజుల తర్వాత కస్తూరి అమ్మాయిని బయటికి పిలిచి,ఇదిగో అమ్మాయి ఈ నెంబర్ కి ఫోన్ చేయమను, ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం,రేపు వెళ్లి కలిస్తే ఉద్యోగం ఇస్తా అన్నారు. వెళ్లి అబ్బాయిని కలవమను అని చెప్తే, వాళ్ళ ఆనందానికి అవధులు లేవు.
తెల్లారి వెళ్లి కలవడం….ఉద్యోగం రావడం….అంత టకాటకా జరిగిపోయింది. ఇంట్లో ఉద్యోగం వచ్చింది అని తెలవడంతో ఇద్దరి ఆనందానికి అంతు లేదు.
రోజు ఉద్యోగానికి వెళ్లి వస్తునాడు, జీవితం అంత హాయిగా గడుస్తుంది. కస్తూరి ఒకరోజు బాధగా ఇంటికి వచ్చింది, కిందే ఉన్న అమ్మాయి, ఏంటి అమ్మ అదోలా ఉన్నారు అని అడిగింది, ఏమిలేదు అని దాటవేసే ప్రయత్నం చేసిన మనసు మాత్రం చెప్పు అంటుంది.
ఏంటో చెప్పండి అమ్మ...
మీరు మాకు ఇంత చేసారు....అస్సలు మీరు ఎందుకు ఈ పని చేస్తున్నారు…
అలాంటి అవసరం ఏమొచ్చింది మీకు అని అమ్మాయి అడిగితే. కస్తూరి కన్నీళ్లతో తన గతం చెప్పడం మొదలు పెట్టింది.
నేను, మా ఆయన, అబ్బాయ్ ముగ్గురం ఈ ఇంట్లోనే ఉండే వాళ్ళం, ఆయన డ్రైవర్, అబ్బాయికి ఇప్పుడు పదహారు సంవత్సరాలు. ముగ్గురం ఈ ఇంట్లో ఆనందంగా ఉండేవాళ్ళం . ఒక రోజు ఆయనతో పాటు అబ్బాయ్ కూడా బండి మీద వెళ్ళాడు, తిరిగి వస్తుండగా ఆక్సిడెంట్ అయ్యింది, ఆయన అక్కడే చనిపోయారు, అబ్బాయ్ ఏమో కోమాలో ఉన్నాడు. ఆపరేషన్ చేస్తే అబ్బాయ్ బ్రతుకుతాడు అని చెప్పారు ఆపరేషన్ కి పది లక్షలు కావాలి, అంత డబ్బు నాకు ఎవరు ఇస్తారు. ఇల్లు అమ్మేద్దాం అని అనుకుంటే మా ఆయన తరుపు వాళ్ళు ఈ ఇంటిలో తమకు వాటా ఉంది అని కోర్టుకి వెళ్లారు. కోర్ట్ తీర్పు వచ్చే వరకు ఇల్లు అమ్మటానికి,తాకట్టు పెట్టటానికి వీలు లేదు అని కోర్టు చెప్పింది. ఈ ఇంట్లో నన్ను ఉండటానికి అనుమతి ఇచ్చిందే తప్ప, అమ్మడానికి ఇవ్వలేదు. ఒక లాయర్ చాలా గొప్పైనా, నా పరిస్థితి తెల్సి ఒక్క రూపాయి తీసుకోకుండా ఇంటి కోసం వాదిస్తున్నాడు. అబ్బాయి పరిస్థితి తలుచు కుంటే రోజు రోజుకి బాధ ఎక్కువైతుంది . చేతిలో చిల్లి గవ్వ లేదు,సాయం అడిగితే చేసే వాళ్ళు లేరు. చేతులు చాచి సాయం అడిగితే ఎవరు చేయలేదు అమ్మ, అదే కొంగు చాచి అడుగుతే డబ్బులు ఇచ్చారు. చేస్తున్న పని తప్పు అని తెలుసు కానీ నా కొడుకు ప్రాణం కోసం ఇది తప్ప ఇంకో దారి లేదు . ఆడదాని రూపాన్ని మాత్రమే ఈ ప్రపంచం చూస్తుంది అమ్మ ..కానీ తడిచిన గుండెను ఎవరు చూడరు. ఆమె పరిస్థితి వెనకాల ఉన్న కష్టాన్ని చూసి ఆ అమ్మాయి కూడా ఏడ్చింది.
కస్తూరి మీద వాళ్ళకి అప్పటి వరకు ప్రేమ మాత్రమే ఉండేది…ఆ రోజు నుండి గౌరవం కూడా పెరిగింది.
అబ్బాయి రోజు కాలేజీ కి వెళ్లి ఉద్యోగం చేస్తూ ఉండే వాడు, ఒక రోజు అనుకోని ఉపద్రవం వచ్చి పడింది. అబ్బాయి కాలేజీ నుండి ఇంటికి వస్తుంటే యాక్సిడెంట్ అయ్యింది . అది తెలిసి అమ్మాయి, కస్తూరి వెంటనే హాస్పిటల్ కి బయల్దేరారు. డాక్టర్ వచ్చి ప్రమాదం ఏమిలేదు చిన్న ఆపరేషన్ చేయాలి అర్జెంటుగ ఒక లక్ష రూపాయలు తీసుకోని రండీ అంటే, అమ్మాయి మొఖం కన్నీళ్లతో తడిచాయి. ఇంతలో కస్తూరి డాక్టర్ దగ్గరికి వెళ్లి సారు..ఆ డబ్బులు నేను తీసుకోని వస్తా మీరు ఆపరేషన్ చేయండి అన్నది. అప్పుడు అమ్మాయి, అమ్మ అవి మీ అబ్బాయ్ కోసం అని దాచుకున్న డబ్బు కదా , వద్దు అమ్మ వద్దు అని బ్రతిమిలాడింది, నేను మా ఇంటికి వెళ్లి మా నాన్నని అడిగి తీసుకోని వస్తా అంటే, ఇప్పుడు అంత టైం లేదు అమ్మ నువ్వు అబ్బాయి దగ్గర ఉండు నేను వెళ్ళి డబ్బు తీసుకోని వస్తా అని చెప్పి బయల్దేరింది.
కస్తూరి ఇంటికి వెళ్ళి తన కొడుకు ఆపరేషన్ కోసం అని దాచిన డబ్బులో నుండి ఒక లక్ష తీసుకోని వచ్చి హాస్పిటల్ లో కట్టింది. ఆపరేషన్ అయిపొయింది … అబ్బాయి కళ్ళు తెరిచాడు, అమ్మాయి కస్తూరి కాళ్ళ మీద పడబోతే గుండెల మీదకి తీసుకోని ఓదార్చింది. కొన్ని రోజులకి అబ్బాయి డిశ్చార్జ్ అయ్యాడు.
రోజులు మళ్ళి మాములుగా గడుస్తునాయ్,రెండు నెలలు గడిచాయి కస్తూరి కొడుకు ఆపరేషన్ కి కావాల్సిన పది లక్షలు సమకూరాయి. రేపు మధ్యాహ్నం రెండు గంటలకి అబ్బాయి కి ఆపరేషన్ చేస్తారు అని డాక్టర్లు చెప్పారు అని కస్తూరి ఇంట్లో చెప్పింది, కస్తూరి మొఖంలో మొదటి సారి వాళ్ళు అంత ఆనందం చుస్తునారు. తెల్లవారింది, కస్తూరి కోసం పోలీస్ జీప్ వచ్చింది. కస్తూరికి పోలీస్ వాళ్ళ భయం కంటే కొడుకు ఆపరేషన్ ఏమవుతుందో అన్న భయం పట్టుకుంది. కస్తూరి ఇంట్లోకి పోలీసులు వచ్చే లోపు కింద ఉన్న అబ్బాయి, అమ్మాయి కస్తూరిని ఆపరేషన్ డబ్బులతో వెనక నుండి పంపించేశారు. పోలీసులు ఇంట్లోకి వచ్చారు, కస్తూరి ఇంట్లో అబ్బాయి అమ్మాయి బెడ్ మీద ఉన్నారు. పోలీసులు నువ్వేనా కస్తూరి అంటే అని అడిగితే అవును నేనే అని ఆ అమ్మాయి చెప్పింది, ఆ అమ్మాయి చెప్పిన మాటలకి అబ్బాయి గర్వ పడ్డాడు. ఇద్దర్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకోని వచ్చారు.
ఇది సారు జరిగింది అని కస్తూరి కోర్టులో చెప్పింది.
జడ్జి గారు ఈ పిల్లల తరుపున వాదిస్తున్న లాయర్ వైపు చూస్తూ ఇవన్నీ మీకు ఎలా తెలిసాయి లాయర్ గారు అని అడిగితే. కస్తూరి ఇంటిని విడిపించడానికి ప్రయత్నిస్తున్న లాయర్ ని నేనే, కస్తూరి నన్ను కలవడానికి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో ఏంజరుగుతుందో చెప్తూనే ఉంటది అని సమాధానం ఇచ్చారు.
కస్తూరి తాను చేసిన పనిని ఒప్పుకుంది, తనకి రెండు నెలలు జైలు శిక్ష విధిస్తు, అరెస్ట్ అయినా ఈ ఇద్దర్ని, ఒకరు చేసిన నేరం తమ మీద వేసుకున్నందుకు మందలిస్తూ నిర్దోషులుగా విడుదల చేస్తున్నాము అని జడ్జి గారు తీర్పు ప్రకటించారు.
కస్తూరిని అరెస్ట్ చేసారు .
కోర్టు బయట వీళ్ళ తరుపున వాదించిన లాయర్ దగ్గరికి అమ్మాయి వెళ్ళి…
నాన్న….అని గట్టిగ హత్తుకొని ఏడ్చింది
అమ్మాయి కళ్ళు తుడిచిన వాళ్ళ నాన్న, మీరు ఇద్దరు తీసుకున్న ఈ నిర్ణయం చాలా గొప్పది అమ్మ. మీ మనసుల్ని అర్ధం చేసుకోలేక పోయా ,మీరు ఇద్దరు నన్ను క్షమించాలి, మీ ప్రేమని అర్ధం చేసుకోక మిమల్ని వెళ్ళగొట్టాను అని అంటే..లేదు అండి మీ వల్లే మాకు జీవితం అంటే ఏంటో అర్థమైంది అని అబ్బాయి చెప్పాడు.
మూడు నెలల తర్వాత అబ్బాయి అమ్మాయి రోడ్ మీద బండి మీద వెళ్తుంటే, దూరంగా కస్తూరి ఒకరి దగ్గరి నుండి డబ్బులు తీసుకోవడం కనిపించింది.
ఇద్దరు కస్తూరి దగ్గరికి వెళ్లారు…
ఏంటి అమ్మ మీరు ఇంకా ఆ పని మానెయ్యలేదా...
ఏంటి బాబు ఎం అంటున్నావ్…
అదే అమ్మ డబ్బులు తీసుకుంటున్నావ్.
ఓహ్ అదా! జైలు నుండి రాగానే ఆ పని మానేసాను బాబు, అబ్బాయి కూడా కోలుకున్నాడు, ఇప్పుడు కాలేజీ కి వెళ్తున్నాడు. అమ్మాయి వైపు చూస్తూ మీ నాన్న గారి పుణ్యమా అని నా ఇల్లు కూడా నాకు వచ్చింది.ఈ బట్టల షాప్ నాదే బాబు, ఇందాక మీరు చుసిన అతను నాకు వడ్డీకి డబ్బులు ఇస్తున్నాడు.
అది విని ఇద్దరు చాలా ఆనందపడ్డారు .

కస్తూరి కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ రోజు మీ ఇద్దరు నింద మీ మీద విసుకోబట్టే నా కొడుకు బ్రతికాడు బాబు. మీరు మీ భవిష్యత్తు ఎం అవుతుంది అని ఆలోచించకుండా ఆ నిర్ణయం తీసుకున్నారు, నాకు అపుడే అర్థమైంది. కొడుకు కోసం చేసినా ! నేను చేసిన పని అయితే తప్పే కదా బాబు, ఎవ్వరు సహాయం చెయ్యట్లేదు అని నా బలహీనతకి బలం ఇచ్చాను …ఆ రోజు మీరు కాపాడారు కాబట్టి సరిపోయింది లేకుంటే నా కొడుకు పరిస్థితి… నిర్ణయిచుకున్న బాబు! ఎంతటి పరిస్థితి వచ్చిన ఇక తప్పుడు పని మాత్రం చెయ్యను బాబు ..

“అసతోమా సద్గమయ
తమసోమా జ్యోతిర్గమయా
మృత్యోర్మా అమృతంగమయ”

About the WRITER

Kowshik Ramadugu

ABOVE PHOTOGRAPH WILL BE USED FOR

THE PARTICIPATION CERTIFICATE.

bottom of page